క్రిస్మస్ పండుగ సమీపిస్తుండడంతో,,సంబురాలు మొదలవుతున్నాయి. క్రిస్టియన్ అయిన హీరోయిన్లు క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. టాలీవుడ్ బబ్లి బ్యూటీ సమంత కూడా ఆ పనిలోనే ఉంది. మరి సమంత పండగ మూడ్ లో ఉంటే..ప్రియుడు అక్కినేని నాగ చైతన్య ఎక్కడ ఉంటాడు. చైతు కూడా సమంత చెంతనే ఉండి..క్రిస్మస్ వేడుకల్లో పాలుపంచుకుంటున్నాడు. ఇప్పుడీ లవ్ కపుల్స్ సమంత బిజీగా ఉన్నారు. ఈ వేడుకలకు క్రిస్మస్ ట్రీని తెచ్చుకున్నట్లు సమంత ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఏడాదిలో తనకు ఎంతో ఇష్టమైన సమయం ఇదే అని ట్విటర్‌లో సమంత తెలిపింది. ఎంతో అందంగా క్రిస్మస్ ట్రీని తయారు చేస్తానని ఓ ఫోటో కూడా సమంత ట్వీట్ చేసింది.
మరో వైపు సమంతకు కాబోయే భర్త అక్కినేని నాగ చైతన్య కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసాడు. చైతన్య హిందువు కదా…మరి చైతన్య ఇంట్లో క్రిస్మస్ సందడి ఏమిటి అనుకుంటున్నారా..? చైతన్య హిందువు అయినప్పటికీ…సమంత క్రిస్టియన్. అందుకనే ఇటు హిందు సంప్రదాయం ప్రకారం, అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గుడిలోను, చర్చిలోను పెళ్లి చేసుకోవాలని ఇది వరకే నిర్ణయించుకున్నారని తెలిసిందే.. అందుకే ఇలా క్రిస్మస్ వేడుకలకు ఇద్దరూ బిజీ అయ్యారు.
గతంలో సమంత మతం మార్చుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను చైతన్యతో పాటు సమంత కూడా ఖండించింది. మతం మార్చుకోవడం అలాంటిది ఏమీ జరగలేదని, తనని ఇష్టపడినప్పుడు తను పూజించే ఏసు క్రీస్తును కూడా ఇష్టపడతానని చైతూ క్లారిటీ ఇచ్చాడు. దేవుడి విషయంలో అలాంటి పట్టింపులు లేవని కూడా తెలిపాడు. చైతూకు దేవుడి పట్ల ఎలాంటి పట్టింపులు లేవని తెలపడాని ఈ ఫోటోనే నిదర్శనమని తెలుస్తోంది. క్రిస్మస్ ట్రీని సమంత ఒక్కటే ఇలా కష్టపడుతూ చేస్తుంటే తాను మాత్రం ఊరికే ఎలా ఉంటానంటూ చైతూ కూడా సహాయం చేస్తున్నట్లుంది కదూ ఈ ఫోటో. నాగచైతన్య, సమంత జంటగా ఏర్పాటు చేస్తున్న ఈ క్రిస్మస్ ట్రీ వారిద్దరికి చాలా స్పెషల్ అని చెప్పాల్సిందే.