అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

646
Allu Arjun Sri Reddy
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. అయితే గత కొద్ది రోజులుగా శ్రీరెడ్డి చెన్నైలో నివాసం ఉంటుంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ ఉంది. శ్రీరెడ్డి హైదరాబాద్ లో లేకపోయినా ఆమె మాత్రం సోషల్ మీడియా వేదికగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై కామెంట్లు చేస్తూనే ఉంది. ముఖ్యంగా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ పై పలు అనుచిత కామెంట్లు చేస్తుంది. పవన్ కళ్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. తాజాగా శ్రీరెడ్డి మరో మెగా హీరోను టార్గెట్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

అల్లు అర్జున్ ఎప్పుడు ఒరిజినల్ హెయిర్ తో నటిస్తావు .. ఎప్పుడు ఎక్స్ టెన్షన్ హెయిర్ తో కనిపిస్తూనే ఉంటావా అని సెటైర్ వేసింది. అల్లు అర్జున్ ది ఒరిజినల్ హెయిర్ కాదని చెప్పడంతో శ్రీరెడ్డి కామెంట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. శ్రీరెడ్డి చేసిన కామెంట్లపై బన్ని అభిమానులు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన అల..వైకుంఠపురంలో మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది.

Srireddy

- Advertisement -