ఏప్రిల్‌లో తేజ-గోపిచంద్ మూవీ..!

406
gopi chand
- Advertisement -

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాచో హీరో గోపిచంద్. ఇటీవలె కిషోర్ తిరుమల దర్శకత్వంలో చాణక్యతో ప్రేక్షకుల ముందుకువచ్చినా బాక్సాఫీస్ ముందు ఢీలాపడ్డాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ముందుకుపోతున్నాడు.

ఈ నేపథ్యంలో తనకు లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టినా దర్శకుడు తేజతో సినిమా చేయడానికి కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు గోపీచంద్. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ పై చర్చలు జరిగాయని తెలుస్తోంది.

అన్నీ కుదిరితే ఏప్రిల్ నుండి సినిమా పట్టాలైక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నిజం సినిమాలతో విలన్‌గా మెప్పించిన గోపిచంద్ …ఈసారి హీరోగా హిట్ కొడతాడా లేదా వేచిచూడాలి.

- Advertisement -