కొలువుదిరిన మహారాష్ట్ర మంత్రివర్గం

366
Maharasta Cabinet
- Advertisement -

ఎట్టకేలకు మహారాష్ట్ర మంత్రివర్గం కోలువుదిరింది. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెల రోజుత తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ముంబైలోని విధానభవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కు కూడా మంత్రి పదవి వరించింది. నేడు ఆదిత్య ఠాక్రే మంత్రిగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 32 రోజుల తర్వాత మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది.

మంత్రివర్గ విస్తరణలో భాగంగా 35 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తంగా మహారాష్ట్ర కేబినెట్‌లో కాంగ్రెస్‌ నుంచి 12 మంది, ఎన్సీపీ నుంచి 16 మంది, శివసేన నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌ 28న ఉద్ధవ్‌ థాకరేతో పాటు మంత్రులుగా బాలసాహెబ్‌ థోరత్‌, నితిన్‌ రౌత్‌(కాంగ్రెస్‌ నాయకులు), ఏక్‌నాథ్‌ షిండే, శుభాష్‌ దేశాయి(శివసేన నాయకులు), జయంత్‌ పాటిల్‌, చగన్‌ భుజ్‌బాల్‌(ఎన్సీపీ నాయకులు) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమితో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి.

- Advertisement -