వరల్డ్‌ చాంపియన్‌గా కోనేరు హంపి..

697
Koneru-Humpy
- Advertisement -

ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి స్వర్ణం పతకం సాధించింది. ఇటీవలే మొనాకో గ్రాండ్ ప్రి చెస్ టైటిల్ గెలుచుకున్న హంపి మరో మెగా టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో గెలిచిన తొలి భారత క్రీడాకారిణి హంపి కావడం గమనార్హం.

మొత్తం 12 రౌండ్ల పాటు పోటీలు జరుగగా, కోనేరు హంపి, లీ టింగ్‌ జి (చైనా), అతాలిక్‌ ఎకతెరీనా (టర్కీ) తొమ్మిదేసి పాయింట్లతో అగ్రస్థానంలో సంయుక్తంగా నిలిచారు. అయితే, మెరుగైన టై బ్రేక్‌ స్కోరు హంపికి లాభించింది. దీంతో ఆమె తొలి స్థానంలో నిలువగా లీ టింగ్‌ జి రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది.

Koneru-Humpy (1)

వీరిద్దరి మధ్యా రెండు బ్లిట్జ్‌ గేమ్‌ లు నిర్వహించగా, తొలి గేమ్‌ లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోయింది. రెండో బ్లిట్జ్‌ గేమ్‌ లో నల్లపావులతో ఆడి, 45 ఎత్తుల్లో గెలిచి వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఇక ఇదే పోటీల్లో మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

- Advertisement -