- Advertisement -
మన్మథుడు 2 తర్వాత మళ్లీ ట్రాక్ మీదికొచ్చాడు కింగ్ నాగార్జున. ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మగా అలరించనున్నాడు. ఈ సినిమాకు వైల్డ్ డాగ్ అనే టైటిల్‌ని ఖరారు చేయగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో రచయిత సోలోమాన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా నాగ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాకు కొత్త టెక్నీషియన్స్..కొత్త ఫిల్మ్ మేకింగ్‌తో ముందుకురానున్నాని 2020 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు నాగ్.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోండగా సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్కౌంటర్ అంటూ చూపించగా గన్ పట్టుకున్న నాగ్ లుక్ అదిరిపోయింది.
- Advertisement -