రూలర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు హీరో నందమూరి బాలకృష్ణ. రూలర్ సక్సెస్మట్లో మాట్లాడిన బాలకృష్ణ ఓ మంచి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి విజయాన్ని ప్రేక్షకులు అందించారని చెప్పారు. నిర్మాత సి కల్యాణ్ ఖర్చుకు ఎక్కడా కాంప్రైజ్ కాలేదు..ఆయనతో నేను చేసిన మూడో సినిమా ఇది అన్నారు.
మంచి కథా విలువలున్న సినిమా చేయాలని భావించే నిర్మాత ఆయన. ఆయనకు నా తరపున, అభిమానుల తరపున కృతజ్ఞతలు. వి.ఎస్.ఆర్.స్వామి వద్ద శిష్యరికం చేసిన రాంప్రసాద్ ఈ సినిమాకు మంచి విజువల్స్‌ను అందించారని చెప్పారు. హీరోయిన్స్ సోనాల్, వేదిక చక్కగా నటించారు. జయసుధ , ప్రకాష్‌రాజు, సప్తగిరి, ధన్‌రాజ్, రఘు అందరూ చక్కగా నటించారు. పరుచూరి మురళి మంచి కథను అందించారని చెప్పారు.
మంచి డైలాగ్స్‌ను కూడా అందించారు. మంచి మెసేజ్‌ను కూడా ఈ కథలో చొప్పించారు మురళి. ఆయనకు థ్యాంక్స్. డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ఆర్టిస్టుల దగ్గర నుండి ఏం కావాలో ఆ నటనను రాబట్టుకునే దర్శకుడు. అలాగే నిర్మాతల దర్శకుడు కూడా ఆయన. చిరంతన్ భట్‌తో నేను చేసిన మూడో సినిమా. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జైసింహా తర్వాత మరోసారి మా కాంబినేషన్లో వచ్చిన రూలర్ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు నిర్మాత సి కల్యాణ్. రాంప్రసాద్ సినిమాను అద్భుతంగా విజువలైజ్ చేసి చూపించారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. ఐదు నెలలు పాటు టీం అందరం ఎంతగానో హార్డ్ వర్క్ చేశాం. మళ్లీ నెక్ట్స్ సినిమా దీని కంటే మంచి సినిమా ఇస్తానని తెలిపారు.