మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత

395
kalvakuntla kavitha
- Advertisement -

మానవత్వాన్ని చాటుకున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. మధుమేహ వ్యాధితో బాధపడుతూ కంటి సమస్యతో బాధపడుతున్న మహిళను ఆదుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మాక్లూర్ మండలం ఏలీయా తండాకు చెందిన నందిని మధేమేహ వ్యాధితో కంటిచూపు లేక ఇబ్బందులు పడుతున్నారు.

చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో మానవతా దృక్పథంతో స్పందించి నందినికి సొంత ఖర్చులతో కంటి ఆపరేషన్ చేయించారు కవిత. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సొంత గ్రామానికి చేరుకున్న నందినిని పరామర్శించారు జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నందినికి చికిత్స చేయించినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -