1996 ఎన్నికల్లో నా వల్లే జయలలిత ఓటమి పాలయ్యారని సూపర్ స్టార్ రజనీ కాంత్ అన్నారు. జయలలితను ఎంతో బాధపెట్టానని రజనీ వ్యాఖ్యానించారు.సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన జయ, చో రామస్వామిలకు ఆదివారం సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రజనీకాంత్ మాట్లాడుతూ తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఘనంగా నివాళులు అర్పించారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.
నాటి ఎన్నికల్లో ఒకవేళ జయలలిత తిరిగి గెలిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని రజనీ వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో జయ బాధపడ్డారన్నారు. ఆ తర్వాతే ఆమె మంచి మనస్సున్న నేతగా ఆవిర్భవించారన్నారు. జయలలితను రజనీకాంత్ కోహినూర్ వజ్రంతో పోల్చారు. పురుషాధిక్య సమాజంలో అనేక ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఆమె ఎదుర్కొన్న సవాళ్లే ఆమెను సానపట్టిన వజ్రంలా మార్చాయన్నారు. ఇరువురి మధ్య వివాదం ఉన్నప్పటికీ తన కుమార్తె వివాహానికి జయలలిత హాజరుకావడం తనని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని రజనీకాంత్ అన్నారు. కుమార్తె వివాహానికి జయలలితను ఆహ్వానించేందుకు బరువెక్కిన హృదయంతో ఆమె అపాయింట్‌మెంట్ కోరానని, ఆమె కలుస్తారని ఊహించలేదన్నారు.
1996లో జయలలితకు వ్యతిరేకంగా నిలి చానన్న విషయం తనను ఇప్పటికీ బాధపెడు తోందని రజనీ అన్నారు. (జయలలిత మళ్లీ ఆధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడుకూడా రక్షించలేడని ఈ ఎన్నికల సందర్భంగా రజనీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే).