- Advertisement -
సీఎం కేసీఆర్ ఈ రోజు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అలయాన్ని సందర్శించారు. ఉదయం 11 గంటలకు అలయానికి చేరుకున్న సీఎంకు మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను పరిశీలించారు. సీఎంతో పాటు ఆలయానికి వచ్చిన వారిలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, విప్ గొంగిడి సునీత, MLAలు గాదరి కిషోర్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, MLC కృష్ణా రెడ్డి, కలెక్టర్ అనిత రాం చంద్రన్,ytda వైస్ చైర్మన్ కిషన్ రావు లు ఉన్నారు.
- Advertisement -