కాజ‌ల్‌కు దక్కిన అరుదైన గౌరవం..!

565
kajal
- Advertisement -

చంద‌మామ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నఈ అమ్మడు తాజాగా అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మైనపు విగ్ర‌హాన్ని ఉంచ‌నున్న‌ట్టు తెలిపింది. దీంతో దాదాపు అన్ని దేశీయ భాష‌ల‌లో న‌టిస్తూ అభిమానుల ఆద‌రాభిమానాలు పొందుతున్న ఈ అమ్మ‌డి క‌ల నెర‌వేరిందని చెప్పాలి.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఈ అమ్మ‌డి కొల‌త‌లు కూడా తీసుకోగా, ఫిబ్ర‌వ‌రి 5,2020 నుండి ఈ మైనపు బొమ్మ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఈ విష‌యం తెలుసుకున్న కాజ‌ల్ సంతోషం వ్య‌క్తం చేస్తుంది. కాజ‌ల్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ స‌ర‌స‌న భార‌తీయుడు 2 చిత్రం చేస్తుంది. హిందీలో ముంబై స‌గ అనే చిత్రంలో న‌టిస్తుంది.

Kajal Aggarwal to get her wax statue at Madame Tussauds Singapore! To be unveiled on 5th of February 2020 at singapore..

- Advertisement -