టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మూడు మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అయినందుకు చాల సంతోషంగా ఉంది అందుకు ఎంపీ సంతోష్‌కి ధన్యవాదాలు తెలుపుతున్న అన్నారు.మొక్కలను పెంచడం భవిష్యత్తు తరాలకు మంచిదని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు కలెక్టర్ కు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
Thank you for participating in #GreenIndiaChallenge and planting saplings 🌱🌱🌱. https://t.co/ifVUuUV9QI
— Santosh Kumar J (@MPsantoshtrs) December 16, 2019
Kumram Bheem Asifabad District Collector Rajeevgandhi Hanumanthu, IAS Today Accepted The Green Challenge and Planted Tree Sapling..