కోహ్లీ మరో అరుదైన ఘనత..!

562
- Advertisement -

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిస్తే.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన ఆధిక్యతను చాటుకున్నాడు. తాజాగా మరోసారి టెస్టు బ్యాటింగ్ రాంకుల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు.

Virat_Kohli

ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల జాబితాలో.. కోహ్లీ 928 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్ ఖాతాలో 911 పాయింట్లున్నాయి. మూడో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ (864), నాలుగో స్థానంలో భారత ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (791) ఉన్నారు. ఇక, పరుగుల వరద పారిస్తున్న ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. ఈ జాబితాలో ఆరోస్థానంలో టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే నిలిచాడు. మొత్తమ్మీద ఐసీసీ టెస్ట్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండడం విశేషం.

Virat Kohli to end 2019 as No. 1 batsman in ICC Test & ODI rankings courtesy twin failures from Steve Smith..

- Advertisement -