శరవేగంగా మహబూబ్‌నగర్‌ – జడ్చర్ల రహదారి పనులు

560
srinivas goud
- Advertisement -

మహబూబ్ నగర్ – జడ్చర్ల జాతీయ రహదారి పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని మంత్రుల అధికారక నివాసంలో జాతీయ రహదారుల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. మహబూబ్ నగర్ – జడ్చర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

నేషనల్ హైవే 167 మహబూబ్ నగర్ – రాయచూరు రోడ్డు మధ్య నుంచి వెళ్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రహదారుల పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయన్నారు.

అదేవిధంగా పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, డివైడర్ పనులు, సెంటర్ లైటింగ్, పట్టణ సుందరీకరణ మరియు పట్టణంలోని జంక్షన్ ల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రోడ్లు పూర్తయితే మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ మాదిరిగా రూపుదిద్దుకుంటుందన్నారు.

దీనికి పట్టణ ప్రజలు విస్తరణ పనులకు సహకరించి మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమీక్ష సమావేశంలో కే శ్రీనివాస్ నేషనల్(NH EE ), రవీంద్ర కుమార్(NH DE) మరియు రహదారి పర్యవేక్షకుడు రామ్ కుమార్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

Minister srinivas goud review on Mahaboobnagar -Jadcherla highway works….Minister srinivas goud review on Mahaboobnagar -Jadcherla highway works

- Advertisement -