జీహెచ్‌ఎంసీ 7 తీర్మానాలకు ఆమోదం

110
ghmc

న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న నేడు స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు స‌మీనా బేగం, మ‌హ్మ‌ద్ అబ్దుల్ రెహ‌మాన్‌, ముస్తఫా అలీ, మిస్‌బా ఉద్దీన్‌, ఎం.మ‌మ‌త‌, ఎక్కల చైత‌న్య క‌న్నా, మ‌హ్మ‌ద్ అఖిల్ అహ్మ‌ద్‌, షేక్ హ‌మీద్‌, టి.అంజ‌య్య‌లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు విజిలెన్స్ విభాగం డైరెక్ట‌ర్‌ విశ్వ‌జిత్ కంపాటి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు సిక్తాప‌ట్నాయ‌క్‌, అద్వైత్ కుమార్ సింగ్‌, కెన‌డి, విజ‌య‌ల‌క్ష్మి, శంక‌ర‌య్య‌, యాద‌గిరిరావు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, ఉపేంద‌ర్‌రెడ్డి, అశోక్ సామ్రాట్‌, మ‌మ‌త‌, సిసిపి దేవేంద‌ర్‌రెడ్డి, చీఫ్ ఇంజ‌నీర్ హౌసింగ్‌ సురేష్‌, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో 7 ఎజెండా అంశాల‌ను చ‌ర్చించి ఆమోదించారు.

స‌మావేశంలో ఆమోదించిన తీర్మానాలు

* జిహెచ్ఎంసి ప‌రిధిలో ప‌నిచేస్తున్న 26,500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఖాతాలలో జ‌మ‌లు, మిన‌హాయింపుల రికార్డుల‌ను మూడు సంవ‌త్స‌రాల పాటు మెయింటనెన్స్‌ను చేసేందుకు సింగిల్ ప్యాకేజి కింద టెండ‌ర్ల‌ను ఆహ్వానించుట‌కై ఆమోదించ‌డ‌మైన‌ది.

* జిహెచ్ఎంసిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ డైరెక్ట‌రేట్‌లో ప‌నిచేస్తున్న పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల‌కు డిప్యూటేష‌న్ అలవెన్స్ మంజూరుకు స్టాండింగ్ క‌మిటి ఆమోదించ‌డ‌మైన‌ది.

* ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ & డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ డైరెక్ట‌రేట్‌లో 100 మంది ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ సేవ‌ల‌ను ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో గ‌రిష్ట వేత‌నం నెల‌కు రూ. 21వేల చొప్పున చెల్లిస్తూ వినియోగించుట‌కు ఆమోదించ‌డ‌మైన‌ది. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ ద్వారా ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌ను తీసుకోనున్నారు.

* గ‌త 15 సంవ‌త్స‌రాలుపైబ‌డి వినియోగిస్తున్న డంప‌ర్ ప్లేస‌ర్ వెహికిల్స్‌, డ్యామేజి డంప‌ర్ బిన్స్ స్థానంలో అద్దె ప్రాతిప‌దిక‌న 35 ఆర్‌.ఎఫ్‌.సి లు, 48 కంప్యాక్ట‌ర్ బిన్స్‌ను ఒక సంవ‌త్స‌ర కాలానికి తీసుకునేందుకు స్టాండింగ్ క‌మిటి ఆమోదించ‌డ‌మైన‌ది. ప‌నితీరు ప్రాతిప‌దిక‌గా మ‌రో రెండేళ్లు పొడిగించుట‌కు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌నైన‌ది.

* హైద‌రాబాద్‌లోని చార్మినార్‌, సాలార్‌జంగ్ మ్యూజియం, మ‌క్కా మ‌సీద్‌, సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ ప్రదేశాల్లో శానిటేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌యోగాత్మ‌కంగా రెండు నెల‌ల కాలానికి మేస‌ర్స్ ఎక్సోరా కార్పొరేట్ స‌ర్వీసెస్ వారికి అప్ప‌గించుట‌కు ఆమోదించ‌నైన‌ది.

* జిహెచ్ఎంసి భూసేక‌ర‌ణ విభాగంలో ఇద్ద‌రు లైసెన్స్ స‌ర్వేయ‌ర్లు, ఒక సివిల్ ఇంజ‌నీర్‌, ఒక స‌ర్వే ఇన్‌స్పెక్ట‌ర్‌ను ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఒక సంవ‌త్స‌ర‌కాలానికి తీసుకునేందుకు స్టాండింగ్ ఆమోదించ‌డ‌మైన‌ది.

* ఇద్ద‌రు రిటైర్డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో స్టాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్ మెంట్ ప్లాంట్ కింద ఆరు నెల‌ల కాలానికి వినియోగించుకునేందుకు స్టాండింగ్ ఆమోదించ‌డ‌మైన‌ది.

GHMC Standing Committee takes 7 major decisions …GHMC Standing Committee takes 7 major decisions ..GHMC Standing Committee takes 7 major decisions