దేశంలోనే నెం1గా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్

359
errabelli dayakar rao
- Advertisement -

దేశంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అగ్రస్ధానంలో నిలుస్తుందన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ రోజు ఉదయం కొరియా నుండి వచ్చిన యంగ్ వన్ కంపెనీ చైర్మన్ కీయాన్ సూవ్ బృందంతో కలిసి పార్కును సందర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్.

dayakar rao

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… మెగా టెక్స్ పార్క్ లో ఈ కంపెనీ 290ఎకరాలు కొనుగోలు చేసిందని చెప్పారు. సింతటిక్,జాకెట్లు,బూట్లు,ట్రాక్ సూట్,ట్రెక్కింగ్ చేయడానికి వేసుకునే డ్రెస్సులు ఈ కంపెనీ తయారుచేయనున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ 900 నుండి 1000 కోట్ల వ్యయంతో 8 యూనిట్లుగా కంపెనీ ప్రారంభించనుంది. ఈ కంపెనీలో 10నుంచి 12వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుందని చెప్పారు.

errabelli

- Advertisement -