క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం అని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన ఛాంబర్ లో జాతీయ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ స్నేహిత్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్…జాతీయ టేబుల్ టెన్నిస్ బంగారం పథకాలు సాధించిన స్నేహిత్, శ్రీజ లకు అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించి రానున్న ఒలింపిక్స్ లో చోటు దక్కించుకోవాలన్నారు.
క్రీడాకారులకు రాష్ర్ట ప్రభుత్వం తరుపున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం…ఇప్పటికే 40 స్టేడియాలు ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. అన్ని రంగాల మాదిరి గానే సీఎం కేసీఆర్ క్రీడా రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ స్పోర్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
telangana minister srinivas goud appreciates Snehith,srija.telangana minister srinivas goud appreciates Snehith,srija.