భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా ప్రశంసలు గుప్పించాడు. తన 400 పరుగుల రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీకి సాధ్యం కాదని రోహిత్ శర్మకే సాధ్యం అవుతుందన్నారు.
టెస్టుల్లో రోహిత్ ఫామ్ ఇలానే కొనసాగితే మంచి పిచ్, పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా ఆ రికార్డ్‌ని అందుకోగలడని చెప్పారు. రోహిత్ వల్ల కాకపోతే పృథ్వీషా కూడా 400 పరుగులు చేసే అవకాశం ఉందన్నారు.
2004లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతులు ఎదుర్కొన్న బ్రియాన్ లారా 43 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. 15 ఏళ్ల కిందట నెలకొల్పిన 400 పరుగుల రికార్డ్‌ని ఏ క్రికెటర్ కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 335 పరుగులతో లారా రికార్డ్‌ని బ్రేక్ చేసేలా కనిపించాడు. కానీ అనూహ్య రీతిలో ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయడంతో వార్నర్ 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచిపోయాడు.