గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కలెక్టర్,ఎమ్మెల్యే

702
khammam collector
- Advertisement -

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) చంద్రశేఖర్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఖమ్మం కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కలెక్టర్ కార్యాలయం అవరణలో మూడు మొక్కలు నాటారు.

Khammam Collector Accepts Green Challenge

ఈ కార్యక్రమంలో వారితో పాటు వారి సతీమణి ప్రియాంక జడ్పీ సీఈఓ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కూడా మూడు మొక్కలు నాటారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మరో ముగ్గురికి నామినేషన్ వేసి, వారిని కూడా మూడు మొక్కలు నాటవాల్సిందిగా కోరారు.

mla vidyasagar

అలాగే ఇందులో భాగంగా జగిత్యాల కలెక్టర్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మెట్‌పల్లి పట్టణంలోని చేపల మార్కెట్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మొక్కలు నాటారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందు ఎంపీ సంతోష్‌కు ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ధన్యవాదలు తెలిపారు.

Khammam District Collector R.V. Karnan has accepted the Green Challenge thrown at him by TRS MP, J Santosh Kumar. On Wednesday, He planted saplings on..

- Advertisement -