కేంద్రం చేతిలో ఎస్సీ వర్గీకరణ:ఎంపీ రాములు

521
mp ramulu
- Advertisement -

ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం చేతిలో ఉందన్నారు టీఆర్ఎస్ ఎంపీ రాములు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టిఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్సి వర్గీకరణ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎంపీ….అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని..ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రానికి అసెంబ్లీ తీర్మాణం పంపిందని గుర్తుచేశారు. ఈ పార్లమంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, పలువురు టీఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

SC Reservation in Central Court says MP Ramulu…SC Reservation in Central Court says MP Ramulu

- Advertisement -