తప్పుడు వార్తలపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం..

52

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై భకుల మనోభావాలు దెబ్బతినెల వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. యాదాద్రి స్వయంభూ విగ్రహంపై ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ యాదగిరిగుట్టలో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఆ పత్రిక ప్రతులను కాల్చివేశారు. అదేవిధంగా ఆ పత్రిక ఎండీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Protest Against Andhrajyothi

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాదాద్రి ఆలయంలో అపచారం జరిగిందని తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికపై నిరసన వ్యక్తం చేస్తూ, ఆలేరు, గుండాల, బొమ్మల రామరం, యాదగిరిగుట్ట,
ఆత్మకూరు ఎం,మోటకుందుర్, రాజపేట,మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు.

Protest Against Andhrajyothi