- Advertisement -
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ లను మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈచిత్రంలోని ఫస్ట్ పాటను విడుదల చేశారు చిత్రయూనిట్.
అడుగడుగో యాక్షన్ హీరో సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య క్యారెక్టర్ గురించి వర్ణిస్తూ సాంగ్ ను షూట్ చేశారు. క్లాస్ మాస్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది సాంగ్. మ్యూజిక్ తో పాటుగా లిరిక్స్ కూడా క్యాచీగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్న బాలకృష్ణ సరసన కథానాయికలుగా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 20న ఈమూవీని విడుదల చేయనున్నారు.
https://youtu.be/yO-buCmun4U
- Advertisement -