కేరళ అధికార భాష శాసనసభ కమిటి సభ్యులు రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. కేరళ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,అసెంబ్లీ అధికారులు స్వాగతం పలికారు. తెలంగాణ అసెంబ్లీ లో మౌళిక సదుపాయాలు ,సభ పనితీరు గురించి కేరళ ఎమ్మెల్యేలకు వివరించారు ఎమ్మెల్యే సునీత. కేరళలో శాసనమండలి లేకపోవడంతో తెలంగాణ శాసన మండలి లో సభ్యుల సంఖ్య,వారి పని విధానాన్ని తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి కేరళ సభ్యులకు వివరించారు. తెలంగాణ శాసన సభా కార్యకలాపాల్లో తెలుగు భాష వాడకం తీరు పై కేరళ కమిటీ కి అవగాహన కల్పించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి కేరళ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సునీత నివాళులర్పించారు. తెలంగాణ అసెంబ్లీ చాలా బాగుందన్నారు కేరళ సభ్యులు. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ ,అభివృద్ధి పథకాలపై ప్రశంసలుకురిపించారు.