రివ్వూః అర్జున్ సురవరం

1763
ArjunSuravaram Review
- Advertisement -

యువహీరో నిఖిల్ ప్రధాన పాత్రలో లావణ్య త్రిపాఠి కథానాయికగా తెరకెక్కిన చిత్రం అర్జున్ సురవరం. టీఎన్ సంతోష్ దర్శకత్వంల వహించగా..మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. సామ్ సీ.ఎస్ సంగీతం అందించారు. తమిళ సూపర్‌హిట్‌ ‘కణితన్‌’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. చాలా రోజుల కిందటే విడుదల కావాల్సిన ఈమూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు. ట్రైలర్, టీజర్ తో సినిమాపై అంచానాలు పెరిగాయి. ఇక ఈసినిమా ఎలా ఉంది. అర్జున్ సురవరం పాత్రలో నిఖిల్ ఎంత వరకు న్యాయం చేశాడో చూద్దాం.

కథః
సినిమాలో నిఖిల్ పేరు అర్జున్ లెనిన్ సురవరం. ఇతడి కుటుంబం తరతరాలుగా జర్నలిస్ట్ వృత్తిలోనే ఉంటుంది. ఇక అర్జున్ వాళ్ల నాన్న (నాగినీడు) అతన్ని ఇంజనీరింగ్ చదివించి, సాఫ్ట్ వేర్ రంగం వైపు పంపించినా అతడు మాత్రం జర్నలిస్ట్ గా ఒక టీవీ ఛానల్ లో చేరుతాడు. అర్జున్ సామాజిక బాధ్యతతో పనిచేస్తుంటాడు. బిబిసిలో ఉద్యోగం సంపాదించాలనేది అర్జున్ కళ. ఈ విషయమై కావ్య (లావణ్య త్రిపాఠి)కు అబద్ధం చెప్తాడు. కానీ, కావ్య అర్జున్‌ పనిచేస్తున్న టీవీ చానెల్‌ సీఈవో కూతురు కావడంతో నిజం వెంటనే బయటపడుతుంది. మొదట అబద్ధం చెప్పాడని అర్జున్‌ గురించి నెగిటివ్‌గా థింక్‌ చేసినా.. బాధ్యతాయుతమైన రిపోర్టర్‌గా అతను పనిచేస్తున్న తీరును గుర్తించి.. బీబీసీలో ఉద్యోగం కోసం కావ్యనే అర్జున్‌ అప్లికేషన్‌ పంపుతుంది. అర్జున్‌కు బీబీసీలో ఉద్యోగం వస్తుంది. దీంతో వీరిద్దరు ప్రేమలో పడతారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. అర్జున్‌తోపాటు ఇతర నిందితులకు కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. కానీ ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో బెయిల్‌పైన బయటకు వచ్చిన అర్జున్‌ సురవరం ఫేక్‌ సర్టిఫికెట్స్‌, ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ రాకెట్‌ను ఎలా వెంటాడుతాడా? నకిలీ సర్టిఫికెట్లతో సమాజానికి ఎంతో చేటు చేస్తున్న ఎంతోమందిని బయటపెట్టి.. అతి పెద్ద స్కాంను, దాని సూత్రధారిని ఎలా పట్టించడాన్నది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ః
సినిమా కథ ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. రెగ్యూలర్ కథలా కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా దర్శకుడు కథను సిద్దం చేసుకున్నాడు. ఈమూవీలో ప్రీక్లైమాక్స్ కు ముందు వచ్చే ట్వీస్ట్ లు హైలెట్ గా నిలుస్తాయి. ఎమోషనల్ సీన్స్ తో మరింత బలం కూడిందని చెప్పుకోవాలి. కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈసినిమాలో నటించిన నటీనటులు అందరూ అద్భుతంగా నటించారని చెప్పాలి. నిఖిల్ పాత్రికేయుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశాడు నిఖిల్. ఇక కావ్య పాత్రలో లావణ్య త్రిపాఠి ఆకట్టుకుందని చెప్పాలి. సినిమా టేకింగ్ అద్భుతంగా ఉన్నా..స్క్రీన్ ప్లే విషయంలో కొద్దిగా శ్రద్ద తీసుకుంటే ఇంకా అద్భుతంగా వచ్చేది. నిర్మాణం విషయంలో నిర్మాతలు ఎటువంటి రాజీ పడకుండా ఖర్చు చేశారని చెప్పాలి. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి హాస్యాన్ని పంచాడు. విలన్‌ పాత్రలో తరుణ్‌ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు.

Lavanya Triapti Nikhil

మైనస్ పాయింట్స్ః

సెకండాఫ్ లో కథనం కొద్దిగా నెమ్మదిన సాగడంతో ప్రేక్షకుడికి కొద్దిగా బోరింగ్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు ఓవర్గా ఉండటం కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు.. ఇక మరోవైపు సంగీతం పర్వాలేదు అనిపించినా..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు.

తీర్పుః

హీరో నిఖిల్ కు సరైన హిట్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఈసినిమా విడుదల కాస్త లేట్ అయినా కానీ చాలా రోజుల తర్వాత నిఖిల్ హిట్ కొట్టాడని అంటున్నారు ప్రేక్షకులు. ఏదిఏమైనా అర్జున్ సురవరం మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది.

విడుదల తేదీః 29/11/2019
రేటింగ్ః 2.75/5
నటీనటులుః నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్‌ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌
సంగీతంః సామ్‌ సీ.ఎస్‌
నిర్మాతః రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
బ్యానర్ః మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పీ
దర్శకత్వంః టీఎన్‌ సంతోష్‌

- Advertisement -