ఆటా ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవాలు..

584
- Advertisement -

న్యూజెర్సీ రాష్ట్రంలోని నార్త్ బ్రన్స్విక్ నగరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. డాక్టర్ వెంపటి చిన్న సత్యం డాన్స్ అకాడెమీ వారి అర్థనారీశ్వర నృత్య రూపకం దీనికి ప్రదాన ఆకర్షణ అయినది. ప్రత్యక్ష వాద్య బృందముతో కలిసి 30 మంది నాట్య బృందము అమెరికాలో పలుచోట్ల వివిధ నృత్య రూపక ప్రదర్శనలు చేశారు. కార్తిక మాసము అర్థనారీశ్వరము ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. ప్రాంతీయ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఆటా పలు రకాల ప్రాంతీయ కళాకారుల ప్రదర్శనకు వేదిక అయింది. ఒక న్యూజెర్సీ నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాలైన కనెక్టికట్, న్యూయార్క్ నుంచి కూడా పలు కళాకారులు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. 20 సంగీత నృత్య కళాశాలలనుంచి 200 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వయసలు వారితో ఈ కార్యక్రమం ఎంతో మనోరంజకముగా సాగినది.

ఇది పూర్తిగా ఉచిత ప్రవేశంతో, ఆటా స్వచ్చంద సేవకులు, సహాయకులు మరియు దాతలు సహాయ సహకారాలతో నిర్వహించబడిన కార్యక్రమం. ఆటా న్యూయార్క్ మరియు న్యూజెర్సీ బృందం యొక్క ఆర్ధిక సహాయం మాటలకి మించినది. సాంస్కృతిక వారసత్వం పట్ల వారికున్న ఆసక్తిని ఔదార్యాన్ని ఈ సంధర్భం తెలియచెప్తుంది. ఈ ప్రాంగణంలో పలు రకాల అమ్మకందారులు సాంప్రదాయ నగలు, దుస్తూలు ప్రదర్శించి మంచి విక్రయాలు చేశారు, మిర్చి రెస్టారెంట్ వారు ప్రేక్షకులకి విందు భోజనం అందజేశారు.

Samskrithika Mahotsavam

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి శ్రమించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియుజేయునది ఇందిరా శ్రీరామ్ (ఆటా మహిళా విభాగం చైర్ ) , శివాని అయిత(ఆటా న్యూ జెర్సీ మహిళా కో-ఆర్డినేటర్), విజయ నాదెళ్ల (ఆటా న్యూ జెర్సీ మహిళా కో-ఆర్డినేటర్), ప్రవీణ్ ఆలా (ఆటా న్యూ జెర్సీ రీజినల్ కో-ఆర్డినేటర్), రవీందర్ గూడూరు (ఆటా రీజినల్ డైరెక్టర్ ) వారి ఆధ్వర్యములో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేశారు.

ఈ సంధర్భంగా ఆటా ప్రెసిడెంట్ పర్మేశ్ భీం రెడ్డి మాట్లాడుతూ.. విధ్యార్తులు, గురువులు, తల్లి తండ్రులు తెలుగు కళా సాంప్రదాయాలకు, సంస్కృతి సంరక్షణకు వారు చేస్తున్న కృషిని కొనియాడారు. తెలుగు వారికి అండదండగా ఉండటమే సంస్థ ప్రధానోద్దేశ్యమని ఆయన తెలిపారు. అందరి సహాయ సహకారాలతోనె ఈ కార్యక్రమం విజయవంతమైనదని అందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. జులై 2020 లో జరగబోయే ఆటా మెగా సంబరాలకు ( కాన్ఫరెన్స్ ) రావాల్సిందిగా అందరిని ఆహ్వానించారు.

ata New Jersey

ఆటా ఎలెక్ట్-ప్రెసిడెంట్ భువనేష్ భుజాల ఈ కార్యక్రమం హాజరు కావాడానికి దూర ప్రాంతమైన వర్జీనియ నుంచి విచ్చేసి అందరికి అభినందనలు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థలైన తానా, నాటా, టి.డి.ఎఫ్. టిఫాస్ నుచి పలువురు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు.

ఆటా న్యూయార్క్/న్యూజెర్సి బృందాలు పుర్తి స్తాయిలో హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ధన్యవాదాలు అందుకున్న ముఖ్యులు శరత్ వేముల (ఆటా జాయింట్ సెక్రటరీ ), బోర్డు అఫ్ ట్రస్టీస్ పరశురామ్ పిన్నపరెడ్డి, శ్రీనివాస్ దార్గుల, వినోద్ కోడూరు, రఘువీర్ రెడ్డి, విజయ్ కుందూరు, శ్రీకాంత్ గుడిపాటి ), సుధాకర్ పెరికారి (పూర్వ అద్యక్షులు ), రీజినల్ అడ్విసోర్స్ ( రాజ్ చిలుముల, రమేష్ మాగంటి, మహీ సన్నప రెడ్డి ), విలాస్ రెడ్డి జంబుల (సోషల్ మీడియా చైర్ ), హరీష్ బంతిని (బిజినెస్ చైర్ ) వారి సహకారముతో పెద్ద ఎత్తున విజయవంతం అయింది.

ఈ కార్యక్రమానికి హాజరైన వారు కార్యక్రమాన్ని చక్కని సాంప్రదాయ రీతిలో నిర్వహించినందుకు ఆటా టీం వర్క్ ని కొనియాడారు. ఆటా కార్యనిర్వాహక కమిటి (న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ప్రాంతీయ మరియు స్థానిక సమన్వయకర్తలు) మద్దతుదారులకి, దాతలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆటా బృందం ప్రింట్ మీడియాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారకులకు ధన్యవాదాలు తెలియచేశారు.

American Telugu Association (ATA) organized a Telugu cultural extravaganza ‘Samskrithika Mahotsavam’ on November 24th at North Brunswick, New Jersey..

- Advertisement -