ఢిల్లీలో దీక్షాదివస్..టీఆర్ఎస్ ఎంపీల నివాళి

506
deeksha diwas
- Advertisement -

దీక్షాదివస్ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్ కుమార్. దీక్షాదివస్ సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.

త్యేక తెలంగాణ కోసం ‘కేసీఆర్‌ చచ్చుడో – తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో 2009 నవంబరు 29న కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టారు. అదే తెలంగాణ ఏర్పాటుకు కీలకమలుపు. ఆరు దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్రం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ.

ఖమ్మం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో…హుటాహుటిన పోలీసులు నిమ్స్ కు తరలించారు. పది రోజుల ఆమరణ దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో గులాబి బాస్ దీక్ష విరమించారు. అలా కేసీఆర్ దీక్ష ఫలితంతో… దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.కేసీఆర్ ఆమరణ దీక్షను చేపట్టి….నేటికి సరిగ్గా పదేళ్లు.

Telangana Rashtra Samithi (TRS) celebrated Deeksha Diwas on a grand note by donating blood here in Across Telangana

- Advertisement -