గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన కరీంనగర్ ఎమ్మెల్సీ..

907
mlc laxman rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఊరూరా ఉద్యమంలా సాగుతుంది. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌లో అన్నివర్గాల వారు భాగస్వాములవుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సుడా చైర్మెన్ జీవీ రామకృష్ణ రావు విసిరిన సవాల్ స్వీకరించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు కరీంనగర్ లోని తన ఇంటి వద్ద మొక్కలు నాటారు.

అంతేకాదు మరో నలుగురిని కూడా ఆయన గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ వేణుగోపాల్రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి చెట్లు నాటడమే కాకుండా ఒక్కొక్కరు మరో ముగ్గురిని గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేయాలని సవాల్ విసిరారు.

green challenge

కరీంనగర్ ఎమ్మెల్సీ, నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో భావితరాలకు ఆక్సిజన్ కొనే అవసరం రాకుండా ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గోని మొక్కలు నాటాలని ఎమ్మెల్సీ నారదాసు సూచించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్చమైన గాలి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకోసం ఆక్సిజన్ కేంద్రాలు కూడా వెలిశాయన్నారు.

Karimnagar TRS MLC Naradasu Laxman Rao Accepts Green Challenge..He plants three sapplings at his House in Karimnagar…

- Advertisement -