పర్యాటక క్షేత్రంగా సోమశిల..

727
srinivas goud
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలోని కృష్ణా నదిలో సోమశిల వద్ద టూరిజం లాంచీ,కాటేజీ లను ప్రారంభించారు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్,టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల,సింగోటం ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. దాదాపు రూ. 28.64 కోట్లతో కాటేజీలు, వ్యూ పాయింట్లు,రెస్టారెంట్లు నిర్మించారు. కృష్ణానది అందాలను తిలకిస్తూ సోమశిల నుంచి శ్రీశైలం చేరుకునేలా ప్రత్యేక డబుల్ డెక్కర్ లాంచీని ఏర్పాటుచేశారు.

నదిలో ప్రకృతి అందాలు,పురాతన క్షేత్రాలు,నల్లమల గిరులు చూస్తూ లాంచీలో విహరించే విధంగా పర్యాటకులకు అన్ని వసతులు కల్పించారు.

Somasila Boating. As a measure of developing tourism in Telangana, boating is being considered one of the prime focus areas. 

- Advertisement -