ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియా (ఇఫి) అవార్డు వేడుకలు గోవాలో ఎంతో వైభవంగా ప్రారంభమైయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్‌ను ‘స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’తో సత్కరించారు. రజినీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నాను. నాకు ఈ స్థానం కల్పించిన నా అభిమానులకు, తమిళ ప్రజలకు ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ “రజినీకాంత్‌ని నా కుటుంబ సభ్యుడిగా భావిస్తాను. ఒకరికొకరు సలహాలను ఇచ్చుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ సలహాలను పాటించం. రజినీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయం“ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ యాక్టర్ ఇజబెల్లా హప్పెట్‌కు లైఫ్‌టైమ్ అచీమ్‌మెంట్ అవార్డును అందించారు. నవంబర్ 28 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
The 50th International Film Festival of India (IFFI) honoured actor turned politician Rajinikanth with a special Icon of Golden Jubilee award..