5అంశాలపై కేంద్రాన్ని సహాయాన్ని కోరామని చెప్పారు మంత్రి ఈటల రాజేందర్. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల దేశవ్యాప్తంగా 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పింది…ఇందులో భాగంగా తెలంగాణలోని 7 జిల్లాల్లో 2 లేదా 3 జిల్లాలని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాచలం, భూపాలపల్లి, తాండూరు లేదా వికారాబాద్ జిల్లాలను సూచించామని త్వరలోనే డిపిఆర్ కూడా తయారు చేసి పంపిస్తామని చెప్పామన్నారు. రెండు లేదా మూడు మెడికల్ కాలేజీలను తెలంగాణకు ఇస్తామని కేంద్రమంత్రి మాట ఇచ్చారని చెప్పారు.
ఆదిలాబాద్, వరంగల్ లో రెండు రీజినల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు ఈటల. రాష్ట్రంలో రెండు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లు మంజూరు చేయాలని కోరామని వాటిని గాంధీ, నిలోఫర్, ఉస్మానియాలో ఏర్పాటు చేస్తాం అన్నారు. 11 ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ట్రామ కేర్ సెంటర్లకు సహకారాన్ని ఆడిగినట్లు వెల్లడించారు.
రాష్ట్రాల అవసరాల దృష్ట్యా సహకారం అందించాలని కేంద్రానికి చెప్పినమని వెల్లడించిన ఈటల…పేదల ఆరోగ్యం కోసం సంవత్సరానికి 1200 కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే మంచిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
దేశానికి ఆదర్శంగా ఉన్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించాలని..అత్యాధునిక ల్యాబ్ లు, స్కాన్ సెంటర్లు ఏర్పాటు చేస్తేనే అందరికి ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పామన్నారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయని…వైద్యరంగంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ 3 స్థానంలో ఉందన్నారు.
Etela Rajender is the Health Minister of Telangana State. He was the Finance Minister of Telangana from 2014–2018. He is an Indian politician belonging to the Telangana Rashtra Samithi party