హుజుర్ నగర్ అభివృద్ది నా బాధ్యతః ఎమ్మెల్యే సైదిరెడ్డి

367
saidireddy

హుజుర్ నగర్ నియోజకవర్గ అభివృద్ది నా బాధ్యత అన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హుజుర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ mla గణేష్ గుప్తా, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమగాని భరత్.. టీటీడీ బోర్డు మెంబర్ మురం శెట్టి రాములు పోలీస్ హౌసింగ్ చైర్మన్ దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు .

ఈసందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేసిన ఆర్యవైశ్య సోదరులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించారని అదే నమ్మకంతో హుజూర్నగర్ నియోజకవర్గానికి కూడా రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేస్తామని అన్నారు. నిరుపేదలుగా ఉన్న ఏ వర్గం వారికైనా ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చేస్తానని అన్నారు.

నిజమాబాద్ (అర్బన్) ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ.. సైదిరెడ్డి నీ గెలిపించినందుకు ఆర్యవైశ్య సోదరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సైది రెడ్డి గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య లకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసి సైదిరెడ్డి గెలిపించారన్నారు.

Huzuranagar Development is My Duty Says Mla Shanampudi SaidiReddy