కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి ఈటెల రాజేందర్..

695
etela rajendar
- Advertisement -

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీ నిర్మాణ్ భవన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గతంలో ఇచ్చిన లేఖలలో పొందుపరిచిన ప్రతిపాదనలను ఆమోదించమని కేంద్ర మంత్రికి ఈటెల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత హాజరైయ్యారు.అలాగే ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

minister etela rajendar

లేఖలలో పొందుపరిచిన అంశాలు ఇవే..

1. కొత్త పిఎంఎస్‌ఎస్‌వై బ్లాక్‌లు
2. మెడికల్ కాలేజీలకు జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్
3. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్
4. కొత్త తల్లి పిల్లల ఆరోగ్యం – ఎంసిహెచ్ కేంద్రాలు

అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌తో భేటీ అయ్యారు మంత్రి ఈటెల రాజేందర్. ఇందులో కూడా ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత హాజరైయ్యారు.

minister etela

Telangana Health Minister Etela Rajender meets Union health minister Harshvardhan..

- Advertisement -