సిద్ధిపేట జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ రోజా శర్మ, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవితవ్యంపై నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..ఉద్యోగం విషయంలో యువతీయువకులు సీరియస్‌గా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే యువతకు ఒక లక్ష్యం ఉండాలి. ఉద్యోగం చిన్నదా..పెద్దదా.. ప్రభుత్వమా.. ప్రయివేట్ దా అని ఆలోచించ వద్దు.. మొదటగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఉన్నచోటు నుండి ఒక అడుగు ముందుకు వెయ్యాలి.. చ్చిన్నదో..పెద్దదో ఒక ఉద్యోగంలో చేరాలి అని యువతకు హరీష్ సూచించారు.
అలాగే సెల్ ఫోన్ కు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. ప్రతి ఒక్కఅరికీ వారికి తగిన అర్హత కనుగుణంగా ఉద్యోగం వచ్చేలా చేస్తాం. ఈ రోజు ఈ మేళాలో ఉద్యోగానికి సెలక్ట్ కాని వారికి Naak ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. యువత కొద్దిగా కష్ట పడితే మంచి అవకాశాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
పుట్టగానే ఎవరూ ఐశ్వర్య వంతులు కారు..టాటా ..బిర్లాలు కూడా మొదట్లో చాలా కష్టపడ్డవారే. సమయాన్ని మీరు కిల్ చేస్తే సమయం మిమ్మల్ని కిల్ చేస్తుంది. చదువుకొని ఇండ్లల్లో ఉంటే ఉద్యోగాలు రావు. తల్లిదండ్రుల కు భారంగా మారతారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాదు. కష్టపడి పనిచేస్తే బిజినెస్ కూడా విజయవంతమవుతుంది. కష్టపడి పనిచేస్తే వ్యవసాయం కూడా మంచి లాభాల నిస్తుంది.యువత తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందాలి. కష్టపడ్డవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని హరీష్ అన్నారు.
ఇంజినీరింగ్ చదివిన వారికంటే ప్లంబర్ లకు,మెస్త్రీలకు,ఎక్కువ ఆదాయం వస్తుంది.యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలి.. ప్రపంచం మారింది.. ప్రభుత్వ ఉద్యోగమొక్కటే… ఉద్యోగం కాదు ప్రైవేట్ రంగంలోనూ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయాని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా యువతకు సూచించారు.
Minister Harish Rao Launches Mega Job Mela in Siddipet..Minister Harish Rao Launches Mega Job Mela in Siddipet