పూరి ‘రొమాంటిక్’ సెట్‌లో రమ్యకృష్ణ..!

771
ramya
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగనాథ్‌ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ఇటీవలే రొమాంటిక్‌ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారు.

charmi

అయితే, రొమాంటిక్ సెట్స్‌లో రొమాంటిక్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, ఛార్మిలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

- Advertisement -