సిడ్నీలో గ్రీన్ ఛాలెంజ్..ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్

436
green Challeange
- Advertisement -

హరిత తెలంగానలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు, సీనీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈగ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నిలో టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా నేతలు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటారు .

తెలంగాణ లోని ప్రజలకు దీని ఆవశ్యకతను తెలపటానికి సిడ్నీ లో మొక్కలు నాటినట్లు తెలిపారు టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినందుకు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ ఆస్ట్రేలియాలో కూడా ప్రారంభమైందని తెలిపారు. ఈమేరకు ట్వీట్టర్ ద్వారా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -