అశోక్ గ‌ల్లాతో నిధి అగ‌ర్వాల్‌ రొమాన్స్..!

611
- Advertisement -

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖు ల స‌మ‌క్షంలో గ్రాండ్ లాంచ్‌కానుంది. రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది.

అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Nidhhi Agerwal in Ashok Galla’s Debut

న‌టీన‌టులు: అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్‌, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు.. సాంకేతిక నిపుణులు:క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.టి,నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా,బ్యాన‌ర్‌: అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి,మ్యూజిక్‌: జిబ్రాన్‌,సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌,ఆర్ట్‌: రామాంజ‌నేయులు,ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి,డైలాగ్స్‌: క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌,కాస్ట్యూమ్స్‌: అక్ష‌య్ త్యాగి, రాజేష్‌,పి.ఆర్‌.ఒ: బి.ఎ.రాజు, వంశీ శేఖ‌ర్‌.

- Advertisement -