ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf)పతాకంపై శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వి.మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ చిత్రం “తాగితే తందానా”. సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ చిత్రం ఒక పాట, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, బ్యానర్ లోగో లాంచ్ కార్యక్రమం నవంబర్ 7న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత దామోదరప్రసాద్, నటులు ఆదిత్, సప్తగిరి, మధునందన్, హీరోయిన్స్ సిమ్రాన్ గుప్తా, రియా, దర్శకుడు శ్రీనాథ్ బాదినేని, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ బి.నాగేశ్వరరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ అనిల్ పాలెపు, చిత్ర నిర్మాతలు వి.మహేష్, వినోద్ జంగపల్లి, నటుడు మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. విచ్చేసిన అతిదులందరిని నిర్మాతలు బొకేలతో స్వాగతించారు.
అనంతరం రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf) బ్యానర్ లోగోని దామోదరప్రసాద్ లాంచ్ చేయగా, సినిమా మొదటి లుక్ ని మారుతి ఆవిష్కరించారు..
హిట్ చిత్రాల దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf) బ్యానర్ చాలా ఇన్నోవేటివ్ గా వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఎగ్జైటింగ్ గా అనిపించింధి. ఈ నిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కొత్త కాన్సెప్టులతో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఆదిత్, మధు, సప్తగిరి ముగ్గురు కలిసి ఆడియెన్స్ ని ఎంటర్ టైం చేయడానికి వస్తున్నారు. వాళ్ళ లుక్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సప్తగిరి హీరోగా చేస్తూనే ఈ సినిమాలో కమేడియన్ గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడం వెరీ హ్యాపి. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకి రైట్ టర్న్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
హీరో ఆదిత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను. తెలిసో తెలియకో నాకు అన్నీ మంచి టైటిల్స్ కుదిరాయి. అలాగే ఈ సినిమాకి కూడా ఇంట్రెస్టింగ్ ఫన్నీ టైటిల్ సెట్ అయింది. దర్శకుడు శ్రీనాథ్ తో వర్క్ చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్న. ఈ సినిమా తర్వాత శ్రీనాథ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే సినిమా ఫీల్డ్ కి కొత్త అయినా నిర్మాతలు ఆరునెలల్లో ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్ తో కంప్లీట్ చేశారు. జెన్యూన్ సినిమా లవర్స్ వాళ్ళు. ఇలాంటి నిర్మాతలను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వారికీ ఈ సినిమా మంచి హిట్ అయి మరిన్ని చిత్రాలు ఇంకా ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ.. ఒక పక్క హీరోగా చేస్తున్నాను. కమీడియన్ గా మంచి పత్రాలు వస్తే చేద్దాం అనుకుంటున్నా తరుణంలో శ్రీనాథ్ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కళ్ళు మూసుకొని ఈ సినిమా చేసేశాను. ఫుల్ లెంగ్త్ కామిడీ రోల్ ప్లే చేశాను. కొత్త కాన్సెప్ట్ తో శ్రీనాథ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అలాగే నిర్మాతలు కొత్తవాళ్ళైనా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ టీమ్ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆదిత్, మధు నేను కలిసి చేసిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. నిర్మాతలు మంచి లాభాలతో సేఫ్ గా బయటపడతారని ఆశిస్తున్నాను.. అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. ముందుగా మా టీమ్ అందరికీ కంగ్రాట్స్. బెస్ట్ ప్రోడక్ట్ తో అసోసియేట్ అయ్యాం. బేసిగ్గా నేను రైటర్ ని. కొత్త డైరెక్టర్ నైనా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు కూడా మంచి సపోర్ట్ చేశారు. మా కథకి యాప్ట్ టైటిల్ ఇది. తాగి తందానాలు ఆడితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఒక ముగ్గురు కుర్రాళ్లు తాగి ఆ మత్తులో ఒక సమస్యలో ఇరుకుంటారు.. దానినుండి ఎలా బయటపడ్డారనేది కాన్సెప్ట్. చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకపాట, ప్యాచ్ వర్క్ మినహా సినిమా అంతా పూర్తిఅయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. అన్నారు.