గుజరాత్ లోని సౌరాష్ట వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో 20 నేడు జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టీ20 పరాజయం తర్వాత సిరీస్ లో విజయానికి కీలకంగా మారిన రెండో టీ20లో గెలిచితీరాల్సిన పరిస్థితి భారత్కు ఏర్పడింది. రోహిత్ సేనను ఓడించిన సిరీస్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలని బంగ్లా భావిస్తోంది.
భారత్ జట్టులో రెండు కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ రాహుల్ స్ధానంలో సంజు శాంసన్,ఖలీల్ అహ్మద్ స్ధానంలో శార్దుల్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోహ్లీ లాంటి ప్లేయర్లు జట్టులో లేనప్పుడు సత్తా చాటుకునేందుకు యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని … తొలి మ్యాచ్ లో రాణించలేకపోయిన రోహిత్ శర్మతో పాటు యువ ప్లేయర్లు రాణిస్తేనే రెండో మ్యాచ్ గెలవగలం అన్నాడు కెప్టెన్ రోహిత్ .
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్/శాంసన్, శ్రేయస్, రిషభ్ పంత్, శివమ్ దూబే, కృనాల్ పాండ్యా, సుందర్, చహల్, దీపక్ చహర్, శార్దుల్/ఖలీల్ అహ్మద్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్/మిథున్, ముష్ఫికర్ రహీమ్, మొసద్దిక్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, ఇస్లామ్, ముస్తఫిజుర్, అల్ అమిన్/సన్నీ అరాఫత్, షఫీయుల్.