ఊపిరి రచయితతో నాగ్‌..!

321
nagarjuna

బిగ్ బాస్ 3 సీజన్‌ తర్వాత సినిమాలపై దృష్టిసారించారు కింగ్ నాగార్జున. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు 2 బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టడంతో తన నెక్ట్స్‌ ప్రాజెక్టుతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ్‌.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా ట్రై చేయాలని భావిస్తున్నారు నాగ్. కాన్సెప్ట్,మెస్సెజ్ ఓరియెంటేడ్ మూవీ చేయాలని భావిస్తున్న నాగ్…కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు.

సోలోమాన్ వినిపించి ఓ స్టోరీ నాగార్జునకు బాగా నచ్చిందిట. ఆ కథను తననే డైరెక్ట్ చేయమని కింగ్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసిన సోలోమాన్‌ త్వరలోనే సినిమా లాంచ్ చేయాలని భావిస్తున్నాడు. మరి కొత్త దర్శకుడితో నాగ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.