జనవరి 5న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం..

246
Talasani
- Advertisement -

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ నేడు హైదరాబాద్‌ పరిదిలోని జియాగూడాలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్ల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ ఆలీ,స్థానిక కార్పొరేటర్‌ కృష్ట పాల్గొన్నారు. వీరితో పాటు సంబంధింత అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూడడమే అందుకే ఎన్ని కోట్లు ఖర్చైన పర్వాలేదు అనుకోని మీకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారు. కుటుంబ సభ్యులు అంత సంతోషంగా ఉండాలన్నదే మన సీఎం కేసీఆర్ కళ. గతంలో సబ్సిడీ విదానంలో ఇండ్లు కట్టిండ్రు.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 లక్షల 50 వేలు పెట్టి ఉచితంగా డబులు బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్.

గతంలో కొన్ని కుటుంబాలు 25 గజాల ఇండ్లలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు 65 గజాల ఇండ్లలో ఉండబోతున్నారు. అయితే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడానికి చూస్తారు. వారు వచ్చి డ బుల్ బెడ్ రూమ్ ఇండ్లు చూస్తే తెలుస్తాది. పేదోళ్లను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నిర్ణయం తీసుకున్నదే ఉచితంగా డబుల్ బెడ్ ఇండ్లు పథకం. ఇప్పటికే అర్హులైన అందరికి కల్యాణ లక్మి , షాది ముబారక్ , పింఛన్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. ప్రపంచమంతా బతుకమ్మను ఆడిపించిన ఘనత తెలంగాణ రాష్ట్రంకు దక్కుతుంది అని మంత్రి అన్నారు.

అన్ని మతాల పండుగలను గౌవరించి ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ గొప్పగా జరుపుకునే విధంగా చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకరికి ఒకరు గోడవపడకుండా అందరం కూర్చొని బస్తి వాసుల నిర్ణయాలను బట్టి లాటరీ సిస్టం పెట్టి ఎవ్వరికి ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్లే విధంగా చూస్తాం. అర్హులైన కుటుంబాలు ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మంచిగా ఉన్న దగ్గర వచ్చి సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జనవరి 5 తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తాం. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకోవాలి అన్నారు మంత్రి తలసాని.

- Advertisement -