మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. మాజీ ఎంపీ కవితమ్మ చొరవ 471 దివ్యాంగులకు మోటార్ బ్యాటరీ ట్రై సైకిల్స్ మంజూరు చేసింది కేంద్రం. దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ఇవాళ అధికారులు లబ్దిదారులకు ట్రై సైకిళ్లను అందజేశారు.
తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.56.52 లక్షలను ఈ సైకిళ్లకు కేటాయించి వెంటనే మంజూరు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి గతేడాది నవంబర్‌లో లేఖ రాశారు. ఇందుకు స్పందించిన కేంద్రం 471 మంది దివ్యాంగులకు అధునాతన బ్యాటరీ మోటారు ట్రై సైకిళ్లను మంజూరు చేసింది.
బోధన్‌లో గతేడాది సెప్టెంబర్ 17న వైద్య శిబిరం నిర్వహించగా… 140 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆర్మూర్‌లో సెప్టెంబర్ 18న వైద్య శిబిరం నిర్వహించి 157 మంది లబ్ధిదారులను గుర్తించారు. నిజామాబాద్ అర్బన్‌లో సెప్టెంబర్ 19న వైద్య శిబిరం నిర్వహించగా… 174 మంది ట్రై సైకిళ్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు.
ఒక్కో ట్రై సైకిల్ విలువ రూ. 37వేలుగా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 25వేలు భరిస్తుండగా ఎంపీ ల్యాడ్స్ నుంచి అప్పటి ఎంపీ కవిత రూ. 12వేల చొప్పున 471 మందికి రూ. 56.52 లక్షలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించారు. ఈ సందర్భంగా కవితకు ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు.