- Advertisement -
అబ్దుల్లాపూర్ మెట్ తహశిల్దార్ విజయారెడ్డిపై తహశిల్దార్ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడాన్ని రాష్ట్ర అబ్కారీ, క్రీడా,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు.హేయమైన చర్యను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ దహనకాండకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని నిందుతుడిని కఠినంగా శిక్షించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారన్నారు. అధికారులు పనిచేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మంత్రి విజయ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
- Advertisement -