తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

421
minister niranjanReddy In Jermany
- Advertisement -

తెలంగాణ నుండి యూరప్‌ దేశాలకు వేరుశనగ ఎగుమతులు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జర్మనీ-నెదర్లాండ్స్‌ దేశాల పర్యటనలో పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం ఆదివారం నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌ డ్యాంలో వేరుశనగ దిగుమతిదారులు, కురగాయల విత్తనోత్పత్తి కంపెనీలతో సమావేశమైంది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలోనే వేరుశనగ ఉత్పత్తిలో ఉమ్మడి పాలమూరుది ప్రథమస్థానం అన్నారు.

Niranjan Reddy

. నాణ్యమైన వేరుశనగ ఉత్పత్తికి కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనుకూలంగా ఉంటుంది.రైతులకు లాభం జరిగే విధంగా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి వేరుశనగ ఎగుమతులు జరిగేలా చేస్తాం. నెదర్లాండ్స్ లో వేరుశనగ వాడకం అధికంగా ఉందన్నారు. నెథర్లాండ్స్ వేరుశనగ కంపెనీల ప్రతినిధులు గత ఏడాది పాలమూరు జిల్లాను సందర్శించినట్లు తెలిపారు మంత్రి.

తెలంగాణ రాష్ట్రం లో ఉత్పత్తి అవుతున్న వేరుశనగ ముంబయి, ఢిల్లీ లో ఉండే దళారులు, మద్యవర్తుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. దీంతో రైతుకు సరైన లాభం కలగడం లేదు ..ట్రేడర్స్ మాత్రమే లాభపడుతున్నారు . ఇలా కాకుండా నేరుగా విదేశాలకు వేరుశనగను ఎగుమతి చేస్తాం.  ప్రపంచ వ్యాప్తంగా వేరుశనగ మార్కెట్ విలువ సంవత్సరానికి దాదాపు 1 బిలియన్ డాలర్లు . యూరప్‌లో పేరొందిన కూరగాయల విత్తన కంపెనీలు పలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. విత్తనోత్పత్తిని చేపడితే తెలంగాణ రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందన్నారు.

- Advertisement -