విధుల్లోకి ఆర్టీసీ ఉద్యోగులు..

488
- Advertisement -

ఆర్టీసీ ఉద్యోగులు సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 30వ రోజుకు చేరింది. దీనిపై శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 49 వేల మంది కార్మికుల పొట్టకొట్టి నష్ట పరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, సోదరుడిగా చెప్తున్నా.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు.

మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది. యూనియన్ల మాయలో పడకుండా కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి అవకాశం చేజార్చుకోవద్దు. మీకు రక్షణ ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

kcr on rtc

అయితే సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరేందుకు ఆయా డిపోలకు చేరుకున్నారు. సమ్మతి పత్రాలు ఇచ్చి, విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలోని చాలా బస్‌ డిపోల వద్దకు ఉద్యోగులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భద్రాచలం, ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ డిపోల వద్దకు కార్మికులు విధుల్లో చేరేందుకు సన్నద్దమై వచ్చారు. కార్మికులను యూనియన్‌ నాయకులు బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -