- Advertisement -
ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈమూవీలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. కాగా ఈసినిమాకు బాలకృష్ణకు రెమ్యూనరేషన్ భారీగా పెంచాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈవిషయంపై స్పందించారు నిర్మాత సి. కళ్యాణ్. బాలయ్య ఎప్పుడూ కూడా రెమ్యునరేసన్ గురించి ఆలోచించరన్నారు. ఈసినిమా కోసం బాలకృష్ణ రెమ్యూనరేషన్ పెంచాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేశారు. అసలు ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ.. మా మధ్య డిస్కర్షన్ రాలేదని చెప్పారు. కాగా ఇప్పటికే ఈమూవీ షూటింగ్ పూర్తిచేసుకోగా..డిసెంబర్ 20వ తేదీన విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.
- Advertisement -