కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యష్ తన నటనతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడమే కాదు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న యష్ గుడ్ న్యూస్ చెప్పాడు.
తాను మరోసారి తండ్రయ్యానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బెంగళూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో రాధికకి పండంటి బాబు జన్మించాడు.తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పాడు.
2016లో బ్రహ్మీస్-గౌడ సంప్రదాయం ప్రకారం రాధిక,యశ్‌లు వివాహం చేసుకోగా, డిసెంబర్ 2,2018న వారికి పండంటి బిడ్డ జన్మించింది. రాధిక, యశ్‌లు టీవీ సీరియల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయగా, 2008లో మొగ్గిన మసు అనే చిత్రంతో తొలిసారి వెండితెరకి పరిచయం అయ్యారు.