పెద్దలు కేశవరావుకి థాంక్యూ: ఎంపీ సంతోష్

531
mp santhosh
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ పై ప్రశంసలు గుప్పించారు కేకే. మాజీ రాష్ట్రపతి కలాం అడుగుజాడల్లో సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌ అనే మహత్తర కార్యక్రమం మొదలు పెట్టడం అభినందనీయమని కొనియాడారు.

ఈ నేపథ్యంలో కేకేకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్ మీలాంటి పెద్దల అభినందనలు ఎంతో ఆనందాన్ని అందించాయని తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్‌ని ప్రమోట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు కేకే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ,కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జై రాం రమేష్ ,టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ,బీజేడీ రాజ్యసభ పక్ష నేత ప్రసన్నాచార్య లకు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాలని సూచించారు.

- Advertisement -