నిరుపేదల ఆరోగ్యానికి భరోసా: మంత్రి గంగుల

380
gangula kamalakar
- Advertisement -

నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో మంజూరైన 36 లక్షల 29 వేల 500 విలువగల 139 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ తన సిఫార్సు మేరకు నియోజకవర్గంలో 139మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు . టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -