రికార్డు సృష్టిస్తున్న “రాములో..రాములా”

556
ala vaikuntapuramlo
- Advertisement -

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా అల..వైకుంఠపురంలో. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈమూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. దీపావళి కానుకగా ఈసినిమాలో నుంచి రాములో రాములా అనే సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. మాంచి మాస్ బీట్‌తో వచ్చిన ఈ సాంగ్.. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కిన పాటగా నిలిచింది. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సాంగ్‌ కేవలం 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్‌తో సౌత్ ఇండియా పరంగా రికార్డ్ సృష్టించింది అంటూ పోస్ట్ చేశారు. కాగా అంతకుముందు విడుదలైన సామజవరగమన సాంగ్ కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈపాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఒక తెలుగు పాటకు ఇంతకు మందు ఇంత పెద్ద సంఖ్యలో వ్యూస్ రాలేదు…దీంతో ఈసాంగ్ రికార్డు సృష్టించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

- Advertisement -