శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. 42గేట్లు ఎత్తిన అధికారులు

463
Srsp Project
- Advertisement -

ఎగువన భారీ వర్షాలు కురస్తుండటంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఉప్పొంగుతున్న గోదారమ్మతో జలాశయం పులకించిపోతోంది. అద్భుత జలదృశ్యంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.

గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తోంది. వరద నీరు ఎక్కువవడంతో 42గేట్లను ఎత్తారు అధికారులు. 2,00,000 క్యూస్సేకుల వరద దిగువకు విడుదల చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్సారెస్పీకి జలకళ రావడంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

- Advertisement -